![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ మీద నటించి పేరు తెచ్చుకున్న వాళ్లంతా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద తమ సత్తా చాటుతూ ఉన్నారు. అందులో ఒకరు సంజన గల్రాని. 2005 లో సోగ్గాడు మూవీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ప్రభాస్ తో బుజ్జిగాడు మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్లి ఫైనలిస్ట్ అయ్యింది. హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటూ టాస్కులు ఆడింది. ఇమ్మానుయేల్ ని కొడుకుగా భావించేది. ఇమ్ము కూడా అమ్మ అమ్మా అంటూ పిలిచేవాడు.
అలాంటి సంజనా తెలుగు టీవీ సీరియల్ లో నటించి తన సత్తా చాటుతోంది. "ఏ దేవి వరము నీవు " అంటూ ఇటీవల మొదలైన ఈ నాటిక ఇప్పుడు తెలుగు ప్రజలను అలరిస్తోంది. జులై 6 నుంచి మొదలైన ఈ సీరియల్ స్టార్ మాలో టాప్ రేటింగ్ లో ఉంది. అలాంటి ఈ సీరియల్ గురించి నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ ని సంజన వాటిని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. ఇంతకు ఎవరెవరు ఏమన్నారో చూద్దాం.
"రోజురోజుకూ ఆమె తన నటనను మెరుగు పరుచుకుంటున్నారు ఆమెను ఏమీ అనొద్దు. ఫస్ట్ టైం ఒక తల్లిగా, విలన్ గా నటిస్తున్నారు. చాల కష్టపడుతున్నారు... సంజన గారు మీ యాక్టింగ్ బాగుంది అలాగే సోనియా గారు శ్రవణ్ గారు మీ యాక్టింగ్ కూడా బాగుంది. చాలా బాగుంది ఈ కొత్త సీరియల్ ... హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఈ సీరియల్ మొత్తాన్ని సంజనా గారే కబ్జా చేసేసారు. నేను మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు సంజన గారు చాలా వెయిట్ తగ్గారని ఇప్పుడు ఆమె కోసమే ఈ సీరియల్ చూస్తున్నాం అన్నారు. కొంతమంది ఆమె నడకను, ముఖ కవళికలను జడ్జ్ చేస్తూ ఉంటారు గుడ్డిగా. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు అన్నారు " అంటూ కామెంట్స్ చేశారు.
![]() |
![]() |